“హరిహర వీరమల్లు” రిలీజ్ టైమ్ కి థియేటర్ల బంద్ అనే విషయం హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై నిన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యి, తన పేషీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ.. “రిటర్న్ గిఫ్ట్ స్వీకరించడం జరిగింది” అని పేర్కొనడం పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఈ లీజుల వ్యవస్థను కంట్రోల్ చేస్తున్న ఆ నలుగురికి మేలు చేకూరేలా మాత్రమే ఈ కొత్త షేరింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది తప్పితే..
థియేటర్ల ఓనర్లకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎలాంటి లాభం ఉండదు అనేది ఇండస్ట్రీ విశ్లేషణ. కట్ చేస్తే.. ఈ నలుగురిలో అల్లు అరవింద్ (Allu Aravind) కూడా ఉన్నారని, పవన్ కళ్యాణ్ కి ఆయన కూడా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతూ వచ్చారు. ఈ విషయాన్ని క్లియర్ చేయడానికి ఓ ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అరవింద్.. “ఆ నలుగురితో నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను” అని స్ట్రాంగ్ & స్ట్రెయిట్ స్టేట్మెంట్ ఇవ్వడమే కాక, ప్రొడ్యూసర్స్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవకపోవడం అనేది ఆలోచించాల్సిన విషయమే.
అలాగే.. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో అసలు థియేటర్ల బంద్ అనేది దుస్సాహసం, అసలు అలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు అల్లు అరవింద్. ఓవరాల్ గా.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో అల్లు అరవింద్ (Allu Aravind) ఏకీభవించడమే కాక, సపోర్ట్ చేశారు.
దాంతో మెగా కుటుంబంలో విభేదాలు లేవు అనేది మరోసారి స్పష్టమైంది. మరి ఇప్పుడు ఫిలిం ఛాంబర్ పెద్దలు లేదా.. అల్లు అరవింద్ లేని ఆ నలుగురు ఎలా స్పందిస్తారు? ఏం చేస్తారు? అనేది చూడాలి.
ఆ నలుగురికీ నాకూ సంబంధం లేదు..
ఆ నలుగురిలో నేను లేను#AlluAravind pic.twitter.com/oOJ8FvAAx7— Filmy Focus (@FilmyFocus) May 25, 2025