Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!

తమిళ స్టార్ హీరో శింబు, మనందరికీ ‘ఎస్.టి.ఆర్'(STR)గా (Silambarasan)  సుపరిచితం..! నిన్న అంటే శనివారం నాడు చెన్నైలోని సాయిరాం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమా ఆడియో లాంచ్ వేడుకలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్  (Kamal Haasan) , సింబు ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.మణిరత్నం (Mani Ratnam) దీనికి దర్శకుడు. జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ఈ వేడుకలో శింబు ప్రసంగానికి అభిమానులు ఫిదా అయిపోయారు.

Simbu

కాసేపు ఫ్యాన్స్‌ను శాంతించమని కోరిన తర్వాతే ఆయన మాట్లాడగలిగాడు. శింబు మొదటగా మద్రాస్ టాకీస్, సుహాసిని  మణిరత్నం(Suhasini) , రాజ్ కమల్ ఇంటర్నేషనల్స్ మహేంద్రన్‌లకు ధన్యవాదాలు తెలిపాడు. తోటి నటీనటులను ప్రశంసిస్తూ, ఏఆర్ రెహమాన్  (A.R.Rahman), మణిరత్నం, కమల్ హాసన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో వివాదాస్పద ‘బీప్ సాంగ్’ విడుదలైనప్పుడు తాను ఎదుర్కొన్న కష్ట కాలంలో ఏ.ఆర్ రెహమాన్ ఎలా అండగా నిలిచారో శింబు గుర్తుచేసుకున్నాడు.

ఆ సమయంలో రెహమాన్ తన పనులన్నీ రద్దు చేసుకుని మరీ తన కోసం ఒక పాట కంపోజ్ చేశారని తెలిపాడు. తన తండ్రి సినిమాల్లో కాకుండా, బయట మొదటిసారి పెద్ద అవకాశం ఇచ్చింది రెహమానే అని, అప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ భాషల్లో 150కి పైగా పాటలు పాడానని శింబు కంటతడి పెట్టుకున్నాడు.

మణిరత్నం తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చారని, ఆ రుణం తీర్చుకోలేనిదని శింబు ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.చిన్నప్పటి నుండి తన నటన ప్రయాణంలో వెన్నంటి ఉండి, తనను తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించాడు. ‘ఈరోజు నేను కమల్ హాసన్‌తో కలిసి నటిస్తున్నానంటే, అది నా జీవితానికి ఎంతో అర్ధాన్ని ఇస్తుంది. ఇదే నాకు సర్వస్వం’ అంటూ శింబు మరోసారి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది.

‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus