సలార్ పాజిటివ్ టాక్ ఓజీ మూవీకి ప్లస్ కానుందా.. ఏం జరిగిందంటే?

  • December 24, 2023 / 12:12 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సలార్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓజీ మూవీ ట్రెండింగ్ లో నిలుస్తోంది. ప్రభాస్ కు సలార్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కగా ఓజీ సినిమాతో పవన్ కు కూడా బిగ్గెస్ట్ హిట్ దక్కుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్ లో రాధా రమా మన్నార్ పాత్రలో నటించిన శ్రియా రెడ్డి ఓజీ సినిమాలో సైతం కీలక పాత్రలో నటిస్తున్నారు.

శ్రియారెడ్డి సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఓజీ సినిమా రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సలార్ పాజిటివ్ టాక్ ఓజీ మూవీకి ప్లస్ కానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమాకు సుజీత్ డైరెక్టర్ కాగా ఈ సినిమా కథ, కథనం విషయంలో సుజీత్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. సుజీత్ ఈ సినిమాతో దర్శకునిగా తన రేంజ్ ను పెంచుకుంటానని నమ్మకంతో ఉన్నారు.

రన్ రాజా రన్, సాహో సినిమాల తర్వాత సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న సుజీత్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. సుజీత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఈ సినిమాపై ఎక్కువగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఓజీ సినిమా ఇతర భాషల్లో సైతం అంచనాలకు మించి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓజీ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓజీ సినిమాలో యాక్షన్ సీన్లు సైతం స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఓజీ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలుస్తుండగా ఈ సినిమా ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. (OG) ఓజీ మూవీతో రికార్డ్స్ బ్రేక్ అవుతాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus