1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజిత్ కలయికలో రూపొందిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ (OG). గతేడాది అంటే 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు సుజిత్ కల్ట్ ఫ్యాన్స్ కావడం వల్ల.. పవన్ కళ్యాణ్ ని ఓ రేంజ్లో ఎలివేట్ చేశాడు. ప్రతి సీన్ హీరో ఇంట్రో సీన్లా డిజైన్ చేశాడు. ఇంటర్వల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ కూడా బాగా పేలింది.

OG Collections

ఓవరాల్ గా చాలా ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది ‘ఓజి’ సినిమా. దీంతో కలెక్షన్స్ ను కూడా భారీగానే వచ్చాయి.

కాకపోతే  ‘కాంతార చాప్టర్ 1’ వంటి పాన్ ఇండియా సినిమా పోటీగా రిలీజ్ అవ్వడం వల్ల.. ‘ఓజి’ ఓపెనింగ్స్ పై కొంత ప్రభావం పడింది. నేటితో ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తిచేసుకుంటున్న నేపధ్యంలో ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

 నైజాం 44.95 cr
సీడెడ్ 19.50 cr
ఉత్తరాంధ్ర 14.05 cr
ఈస్ట్ 11.28 cr
వెస్ట్ 8.65 cr
గుంటూరు 9.92 cr
కృష్ణా 8.83 cr
నెల్లూరు 4.32 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 121.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 15.27 cr
ఓవర్సీస్ 32.42 cr
టోటల్ వరల్డ్ వైడ్ 169.19 (షేర్)

‘ఓజి’ (OG) చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.169.19 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.286.7 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.4.81 కోట్ల దూరంలో ఆగిపోయి ఎబౌవ్ యావరేజ్ మూవీగా నిలిచింది.

మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus