OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

చెప్పడం అయితే చెప్పారు కానీ.. ఇప్పట్లో సినిమా ఓకే అవ్వడం, పవన్ కల్యాణ్‌ డేట్స్‌ ఇవ్వడం అంత ఈజీ కాదు. కథా చర్చలు మొదలయ్యాయి అంటున్నారు కానీ.. కథ ఓకే అయ్యి, సెట్స్‌ మీదకు సినిమా వెళ్లడం అంత ఈజీ కాదు. ఈ రెండు రకాల మాటల్ని ముక్కలు చెక్కలు చేస్తూ గ్లింప్స్‌ వీడియోతో షాకిచ్చారు దర్శకుడు సుజీత్‌. పవన్‌ని కూర్చోబెట్టి తన స్టోరీ బుక్‌ చూపించి, కథ చెప్పింది. ‘నీకు ఏం కావాలన్నా నేను రెడీ.. ఏం చేయమంటావ్‌ చెప్పు’ అని పవన్‌తో చెప్పించారు సుజీత్‌.

OG 2

అయినా, ఇంకా ఎక్కడో ఓ డౌట్‌ అయితే పవన్‌ ఫ్యాన్స్‌ కి ఉంది. అదే ఈ సినిమా కథ ఎప్పటికి పూర్తి చేస్తాడు సుజీత్‌. నానితో చేస్తున్న ‘బ్లడీ రోమియో’ సినిమా ఎప్పటికి అవుతుంది అని. కానీ సుజీత్‌ సన్నిహితుల సమచారం ప్రకారం అయితే సినిమా కథ 75 శాతం వరకు అయిపోయిందట. మీరు చదివింది కరెక్టే. సినిమాకు సంబంధించిన కథ మరికొన్ని రోజుల్లో రెడీ చేస్తారట. ‘ఓజీ’ సినిమా స్టైల్‌లో పవన్‌కి ఖాళీ టైమ్‌ ఉన్నప్పుడు షూటింగ్‌ పెట్టి పూర్తి చేస్తారట.

సినిమా కాస్ట్‌ అండ్‌ క్రూ విషయంలో కొత్త ఆలోచనలు ఏవీ లేవు. ‘ఓజీ’ సినిమాకు పని చేసిన టీమే ఇప్పుడు ‘ఓజీ 2’కి పని చేస్తుంది. అయితే హీరోయిన్‌ ఎవరు అనదే ఇక్కడ ప్రశ్న. తొలి పార్టులో హీరోయిన్‌ పాత్రను చంపేశారు. కాబట్టి ఇప్పుడు ఇంకో ఇంకో హీరోయిన్‌ రావాలి. అయితే ఇది సినిమా కథ నేపథ్యం బట్టి ఉంటుంది. ఆ సినిమాకు ‘ఓజీ’ కథకు ప్రీక్వెల్‌ అయితే విదేశీ హీరోయిన్‌ అవసరం అవుతుంది. లేదు తర్వాత కథ అయితే.. ఇంకో పాత్రను లైవ్‌ చేయాలి.

ఇక మరో విషయం చూస్తే.. ప్రస్తుతం సినిమా అప్‌డేట్స్‌ అన్నీ పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ మీదే వస్తున్నాయి. కానీ సినిమా ప్రొడక్షన్‌ని హ్యాండిల్ చేయబోయేది పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ (విశ్వప్రసాద్‌), జైత్ర రామా మూవీస్‌ (రామ్‌ తాళ్లూరి) అంటున్నారు. ఇదే జరిగితే వారి బ్యానర్‌లో పవన్‌ చేస్తారనుకున్న సముద్రఖని, సురేందర్‌ రెడ్డి సినిమాలు ఉండవు అని చెప్పొచ్చు.

అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus