Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

మీరు సోషల్‌ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లు అయితే కచ్చితంగా ఈ వీడియోలు ఇప్పటికే చూసి ఉంటారు. ఈ క్రమంలో రెండు రకాల మాటలు వినిపిస్తాయి. ఒకటి మోహన్‌ లాల్‌ డ్యాన్స్‌ అదిరిపోయింది అనే మాట కాగా, రెండోది ఇలాంటి డ్యాన్స్‌లు ఇప్పుడు సినిమాల్లో ఎందుకు వేయడం లేదు అని. ఆ వీడియోల్లో లాలెటన్‌ డ్యాన్స్‌లు అంత గ్రేస్‌గా అదిరిపోయాయి మరి. కావాలంటే మీరూ చూడండి మీకు కూడా అదే మాట అనిపిస్తుంది.

Mohanlal

జర్మనీలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు చాలా పాటలకు మోహన్‌ లాల్‌ డ్యాన్స్‌లు వేశాడు. ఒక్కో పాటకు ఒక్కో అమ్మాయితో.. ఒక్కో డ్రెస్‌లో వావ్‌ అనిపించాడు. ఆ పాటల్లో ‘బాహుబలి’లో ‘ఇరుక్కుపో..’ పాట ఒకటి కాగా, ధనుష్ ‘తిరుచిట్రంబలం’ సినిమాలో ‘మేఘం కరుకాతా’, ‘ఆవేశం’ సినిమాలోని ‘ఇల్యూమినాటీ’, దుల్కర్‌ సల్మాన్‌ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ సినిమాలోని ‘కలపక్కర’ పాటలు ఉన్నాయి.

ఈ పాటలకు సానియా ఇయ్యప్పన్, స్వాసికతో కలసి మోహన్‌లాల్ డ్యాన్స్ చేశారు. అలాగే లెజండరీ ప్లేబ్యాక్ సింగర్ చిత్రతో కలసి పాటలు కూడా పాడారు. జూన్ 26న ఒబెర్‌ హౌసెన్‌లోని రుడాల్ఫ్ వెబర్ ఎరీనాలో జరిగిన ‘ది కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ లైవ్ ఇన్ జర్మనీ: బియాండ్ ది స్క్రీన్’ అనే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రదర్శనలు జరిగాయి. యూరప్‌లోని ప్రవాస భారతీయుల కోసం కొంతమంది భారతీయ కళాకారులు ఈ సాంస్కృతిక వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమం తర్వాత సానియా ఇయ్యప్పన్ వేడుక వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. అందులో మోహన్‌లాల్‌తో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ ‘పూకీ లాలేట్టన్’ అని రాసుకొచ్చింది.

సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus