OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

ఓ సినిమా విజయం సాధిస్తే.. ఆ విజయం ఇండస్ట్రీ హిట్‌ అయితే.. ఆ సినిమా కాన్సెప్ట్‌కు దగ్గరగా మరికొన్ని సినిమాలు పుట్టుకొస్తుంటాయి మన సినిమా పరిశ్రమలో. మన దగ్గరే కాదు మొత్తం ఇండియన్‌ సినిమానే ఇలా ఉంది. ఆ మధ్య ‘కేజీయఫ్‌’ సినిమా విజయం చూసి.. ఆ తర్వాత అలాంటి కాన్సెప్ట్‌లో ఎన్ని సినిమాలొచ్చాయో చూశారు కదా. ఇప్పుడు ‘పుష్ప’ వంతు వచ్చింది. ఈ సినిమా వచ్చి విజయం సాధించాక ఇతర పరిశ్రమల్లో ఇలాంటి లైన్స్‌ బయటకు తీస్తున్నారు.

OM

అలా అని ఈ సినిమాకు ఆ సినిమాకు లింక్‌ ఉంది అంటూ కాపీ మరకలు తీయడం సరికాదు. కానీ కొందరు ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఎంటే.. ధనుష్‌ హీరోగా రాజ్‌ కుమార్‌ పెరియసామి ‘ఓం’ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఎర్ర చందనం నేపథ్యంలో సాగే కథతో దీన్ని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. దీంతో ఈ సినిమాను అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాలతో పోలుస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై దర్శకుడు రాజ్‌ కుమార్‌ పెరియస్వామి మాట్లాడుతూ.. మేం కేవలం సినిమాలోని ఓ సీన్‌ను మాత్రమే చూపించాం. ‘ఓం’ సినిమాలో మరెన్నో అంశాలున్నాయి. మీరు సినిమా చూశాక అర్థమవుతాయి. అప్పుడు ఈ సినిమా సంగతి నిర్ణయించండి. టైటిల్‌ టీజర్‌ చూశాక ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఆలోచిస్తున్నారు. మేం ప్రేక్షకుల్లో ఓ చర్చను లేవనెత్తడానికే ఈ గ్లింప్స్‌ విడుదల చేశాం అని అసలు విషయం చెప్పారు. అంటే ఈ సినిమా గురించి చర్చ జరగడానికే ఇలా చేశారని అర్థమవుతోంది.

మరోవైపు ‘పుష్ప’ సినిమాలతో వచ్చిన పోలికలను ఖండించకపోవడం, ఆ సినిమానే పోలి ఉంటుందని స్పష్టం చేయకపోవడంతో ‘ఓం’పై సస్పెన్స్ కొనసాగుతోంది. చూద్దాం సినిమా వస్తే కానీ అసలు సంగతి తేలదు. అన్నట్లు ఈ సినిమాలో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ ‘చాప్టర్‌ 1 ఉదిరమ్‌: ది బ్లడ్‌ వుడ్‌’గా అక్టోబర్‌ 16న విడుదల కానుంది.

మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus