ఆకట్టుకున్న “ఓం నమో వేంకటేశాయ” లోగో

Advertisement

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న నాలుగో భక్తిరస చిత్రం “ఓం నమో వేంకటేశాయ”. అన్నమయ్య, శ్రీ రామ దాసు, షిరిడి సాయి సినిమాలకు అద్భుత సంగీతాన్ని అందించిన యం.యం. కీరవాణి ఈ సినిమాకు కూడా స్వరాలను సమకూర్చుతున్నారు. ఇందులో నాగార్జున వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీమ్ రామ్ బాబా పాత్ర పోషించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన తిరుమల సెట్ లో ఈ మూవీ షూటింగ్ ఈ నెల రెండు నుంచి మొదలైంది. జె.కె. భారవి కథ అందిస్తున్న ఈ సినిమా లోగోను నేడు (శనివారం)  కె.రాఘవేంద్ర రావు తన ఫేస్ బుక్ పేజీలో విడుదల చేశారు. ఇందుకు విశేష స్పందన లభిస్తోంది.

ఈ లోగో నాగ్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శకేంద్రుడు తెరకెక్కిస్తున్నారు. తిరుమల వాసునికి ఎంతో ప్రీతి పాత్రమైన శనివారం రోజే సినిమాకు సంబంధించిన పనులను ఆరంభిస్తున్నారు. షూటింగ్ మొదలైన రోజు, లోగో రిలీజ్ అయినా ఈ రోజు శనివారం కావడమే అందుకు నిదర్శనం. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నతర్వాత నాగార్జున చేస్తున్న “ఓం నమో వేంకటేశాయ”లో వెంకటేశ్వరుడిగా హిందీ నటుడు సౌరభ్ రాజ్ జైన్, శ్రీదేవిగా విమలా రామన్, భూదేవిగా పావని గంగి రెడ్డి నటిస్తున్నారు. అనుష్క సన్యాసిగా కనిపించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus