రామ్‌చరణ్ నుండి ఎవరూ ఊహించని కబురు ఒకటి వినిపించబోతోందా? అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. తన కొత్త సినిమా ప్రకటనను త్వరలోనే వినిపిస్తారు అని చెబుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్ట్ గురించే కదా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చర్చలోకి వచ్చిన సినిమా మరో దర్శకుడితో. అది కూడా బాలీవుడ్ దర్శకుడితో అని చెబుతున్నారు. అయితే ఇక్కడ సమస్యంతా ఆయన గత సినిమాకు వచ్చిన ఫలితం, బ్యాక్‌లాష్.
‘పెద్ది’ సినిమాతో రీసెంట్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. వసూళ్ల విషయంలో ఒక్కొక్కరి నోట ఒకే మాట ఉన్నా.. సినిమాలో నటన విషయంలో రామ్‌చరణ్‌కు ఎవరూ పేరు పెట్టని విధంగా ష్యూర్ షాట్ హిట్ కొట్టేశాడు. అయితే ఆ తర్వాత చేయాల్సిన సుకుమార్ సినిమా గురించి ఎక్కడా సరైన సమాచారం రావడం లేదు. దీంతో ఈ సినిమా ఉందా? లేదా? అనౌ డౌట్స్ వస్తున్నాయి. అయితే సినిమా ఉంది అనేదే క్లారిటీ ఆన్సర్.
అయితే, ఈ లోపు ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ అంటుండటతో.. మరోసారి డౌట్ వచ్చేసింది. ఆ విషయం వదిలేస్తే.. ఇప్పుడు చేస్తారంటున్న ఆ సినిమాకు దర్శకుడు ఓం రౌత్. అవును ప్రభాస్‌కి, మొత్తం ఇండియన్ సినిమాకు డిజాస్టర్ కా బాప్ లాంటి సినిమా ఇచ్చిన ఓం రౌత్‌తోనే ఇప్పుడు చరణ్ ఓ సినిమా చేస్తాడని టాక్. ఇటీవల ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని.. చరణ్ సంతృప్తిగా ఉన్నాడని సమాచారం.
ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ, తెలుగు పెద్ద నిర్మాణ సంస్థ కలసి ఆ సినిమా చేస్తాయట. ఓం రౌత్ అంటే అందరూ ‘ఆదిపురుష్’ అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆయన ‘తానాజీ’ లాంటి ఓ బ్లాక్‌బస్టర్ సినిమా కూడా చేశారు. ఇప్పుడు చరణ్‌కి కూడా అలాంటి ఒక పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కథే చెప్పారట. మరి అంతా ఓకే అయి ఈ సినిమా చరణ్ 17వ సినిమాగా అనౌన్స్ అవుతుందా? లేక 18వ సినిమాగా అనౌన్స్ అవుతుందా? అనేది చూడాలి.