Omkar: సరికొత్త డాన్స్ షోతో సందడి చేయనున్న ఆహా.. ఆడిషన్స్ ప్రారంభం?

  • June 22, 2022 / 07:07 PM IST

కరోనా సమయంలో ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ ఆహా ద్వారా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు, సింగింగ్ షోస్, టాక్ షోలు ప్రసారం అవుతూ పెద్దఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి. ఈ కార్యక్రమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడంతో అతి తక్కువ సమయంలోనే ఆహాకు విపరీతమైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఆహా తాజాగా సరికొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్న ఓంకార్ తాజాగా ఆహా ద్వారా డాన్స్ ఐకాన్ అనే సరికొత్త కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆహా, ఓక్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి సమర్పిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకునేవారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు అయితే మీ డాన్స్ పర్ఫార్మెన్స్ గల 60 సెకన్ల వీడియోని danceikon@oakentertainments.com అనే ఈ మెయిల్ కు పంపించాలి.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆడిషన్స్ ప్రారంభమయ్యాయి. జూన్ 22 వ తేదీ నుంచి ప్రారంభమైన ఆడిషన్స్ జూలై 10వ తేదీ వరకు కొనసాగుతాయి.అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలను కొనేవారు వయసు ఐదు సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు వరకు అర్హులని ప్రకటించారు. మీలో అద్భుతమైన ప్రతిభ ఉంటే వెంటనే ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు వెల్లడించారు.

ఇకపోతే ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో డాన్స్ కార్యక్రమాలు కొనసాగుతూ ఎంతో మంది అద్భుతమైన డాన్సర్ లను అందరికీ పరిచయం చేస్తున్నారు.ఇలాంటి డాన్స్ షోలో వల్ల వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెడుతూ చాలా మంది డాన్సర్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే డాన్స్ షో ద్వారా మరోసారి ఆహా ప్రతిభావంతులైన డాన్సర్ లను ఈ వేదికగా అందరికీ పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ డాన్స్ వీడియో ని పంపించి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus