నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ మొదటి నుంచి కూడా మాస్ ఆడియెన్స్ చేత నాన్ స్టాప్ గా విజిల్స్ వేయిస్తూనే ఉన్నాడు. ఆయన డైలాగ్ చెబితే థియేటర్ దద్దరిల్లాల్సిందే. అయితే బాలకృష్ణ కెరీర్ లో ఎక్కువగా ట్రెండ్ సెట్ చేసిన చిత్రాలలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. పల్నాటి బ్రహ్మనాయుడు, నరసింహా నాయుడు, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలతో ఒకప్పుడు అభిమానులను ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి.
అయితే మళ్ళీ చాలా కాలం తరువాత ఆ వింటేజ్ బాలయ్యను ఫ్యాక్షన్ డ్రాప్ కథలో చూపించాలని గోపిచంద్ మలినేని గట్టిగానే ప్రయత్నాలు చేస్తిన్నాడు. క్రాక్ అనంతరం అదే తరహాలో రియల్ ఇన్సిడెంట్ ఫ్యాక్షన్ కథలను తవ్వుతున్న గోపీచంద్ ఇప్పటికే మెయిన్ స్టోరి సిద్ధం చేసుకున్నారు. ఇక కథలో హైలెట్ అయ్యేలా కొన్ని నిజమైన సంఘటనల గురించి తెలుసుకుంటున్నారు. అనంతపురంలో ఇప్పటికే పాత లైబ్రరీలోని న్యూస్ పేపర్లను కూడా తనిఖీ చేశాడు.
వీలైనంత వరకు నెవర్ బిఫోర్ అనేలా బాలయ్యను పవర్ఫుల్ గా చూపించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య మరోసారి తొడకోట్టి కత్తి పడితే బాక్సాఫీస్ ఏ రేంజ్ లో షేక్ అవుతుందో చూడాలి.