ఆ హీరో పై మరోసారి కేసు నమోదు.. కారుతో రెండు బైకులను ఢీ కొట్టాడట..!

దర్శకరత్న,ఒక్కప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి పెద్ద దిక్కు అయినటు వంటి దివంగత దాసరి నారాయణ రావు గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో ఇండస్ట్రీ హిట్ లు, బ్లాక్ బస్టర్ లు అందించారు ఆయన. రాజకీయాల్లో కూడా ఆయన సత్తా చాటిన వారాయన. 2017 లో ఆయన కాలం చేయడంతో టాలీవుడ్ కు పెద్ద అంత లేకుండా పోయింది అనే చెప్పాలి. ఆయన స్థానాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ భర్తీ చేయలేకపోతున్నారు.

అప్పట్లో టాలీవుడ్ కు ఏ సమస్య వచ్చినా దాసరి గారి వద్దకు వెళ్ళేవారు సినీ పెద్దలు. అయితే ఇప్పుడు కుటుంబంలోనే ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి.కొన్నాళ్ళుగా దాసరి గారి కొడుకుల ప్రవర్తన బాలేదంటూ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లిన సందర్భాలను సైతం మనం చూసాం. ఇప్పుడు మరోసారి దాసరి గారి చిన్నబ్బాయి అరుణ్ పై కేసు నమోదైంది. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో దాసరి అరుణ్ పై కేసు నమోదైంది. విషయంలోకి వెళ్తే..తన కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ దాసరి అరుణ్.. రెండు బైక్ లను ఢీకొట్టాడట.

అరుణ్ ర్యాష్ డ్రైవింగే కారణమని భావించిన పోలీసులు అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు . యాక్సిడెంట్ కు సంబంధించిన సి.సి.టీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలించి అరుణ్ పై తగిన చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ఇక సినిమాల్లో హీరోగా అరుణ్ పెద్దగా రాణించలేకపోయాడు. ఒక్క క్షణం, వెంకీ మామ, శైలజారెడ్డి అల్లుడు వంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ ప్లే చేసాడు కానీ అవి కూడా అతనికి కలిసి రాలేదు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus