చిరంజీవి అనిల్ సుంకర కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న నేపథ్యంలో అనిల్ సుంకరపై జాలి చూపుతూ పలు కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. భోళా శంకర్ మూవీ ఫైనాన్స్ ఇబ్బందులకు చెక్ పెట్టడానికి అనిల్ సుంకర కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే అనిల్ సుంకర చిరంజీవిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త వైరల్ అయింది.
వైరల్ అయిన వార్త గురించి ఒక వ్యక్తి అనిల్ సుంకరను సంప్రదించగా అనిల్ సుంకర ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవి క్యారెక్టర్ గురించి గొప్పగా అనిల్ సుంకర పేర్కొన్నారు. చిరంజీవి గురించి చెడుగా చెప్పినట్టు వచ్చిన వార్త నిజం కాదని నేను అమెరికాకు వెళుతున్నానని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు. వైరల్ అవుతున్న ఆ న్యూస్ ను పట్టించుకోవద్దని అనిల్ సుంకర అన్నారు.
చిరంజీవి (Chiranjeevi) గారితో నేను మరో సినిమాను నిర్మించనున్నానని అనిల్ సుంకర కామెంట్లు చేశారు. చిరంజీవి గారు జెన్యూన్ హ్యూమన్ అని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు. సినిమాతోనే సమాధానం చెబుదామని అనిల్ సుంకర పేర్కొన్నారు. అనిల్ సుంకర చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. అనిల్ సుంకర మంచి మనిషని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సినిమాకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఓర్పుతో సమాధానం చెప్పే మంచి గుణం అనిల్ సుంకరకు ఉంది. అనిల్ సుంకరకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని ఇండస్ట్రీలో అనిల్ సుంకర నంబర్ వన్ ప్రొడ్యూసర్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భోళా శంకర్ బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. ఈ సినిమా బుకింగ్స్ పుంజుకోవడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.