కొరటాల శివ దర్శకత్వంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తారా?

  • June 5, 2018 / 10:23 AM IST

అప్పట్లో రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టారు. ఇప్పట్లో ఖైదీ నంబర్ 150 లో డ్యూయల్ రోల్ పోషించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సినిమా మొత్తం ప్రతి సన్నివేశంలో చిరు కనిపిస్తే అభిమానుల ఆనందమే వేరు. ఆ విషయాన్నీ కొరటాల శివ బాగా పసిగట్టినట్టున్నారు. అందుకే చిరు కోసం తాను రాస్తున్న స్క్రిప్ట్ లో ఇద్దరు చిరులు ఉండేలా చూసుకున్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి సినిమా  చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లోకి రానుంది. అయితే ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.  భరత్ అనే నేను సినిమాతో వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్న కొరటాల ప్రతిభని మెచ్చుకొని అతని దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారని సమాచారం. మెగాస్టార్ ఒకే చెప్పడంతో శివ స్క్రిప్ట్ పనుల్లో దిగిపోయారు. మూడు నెలల్లో ఈ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి చిరంజీవికి చెప్పాలని అనుకుంటున్నారు. కథ కొలిక్కి వచ్చిందని.. . అందులో చిరు ద్విపాత్రాభినయం చేస్తారని.. అందుకో ఒకటి ధనవంతుడైన ఎన్నారై పాత్ర కాగా మరొకటి రైతు పాత్రని తెలిసింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus