Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’ లో కట్టప్ప లాంటి పాత్రని లీక్ చేసిన చిరంజీవి..!

  • September 29, 2022 / 01:13 PM IST

మెగాస్టార్ చిరంజీవికి కొంచెం తుత్తర ఎక్కువ. ఏ సినిమా వేడుకలో అయినా సరే ఆయన 15 నుండి 30 నిమిషాల వరకు మాట్లాడుతూ ఉంటారు. అందరినీ చూసిన ఆనందంలోనో లేక అభిమానుల కేరింతలకో కానీ ఉత్సాహంలో ఆయన.. ఆయా సినిమాలకు సంబంధించిన కీలక అంశాలను బయట పెట్టేస్తూ ఉంటారు.’రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆది పాత్ర చనిపోతుంది అన్న విషయాన్ని ఆయన బయటపెట్టేసిన సంగతి తెలిసిందే. అటు తర్వాత ‘ఆచార్య’ అనే టైటిల్ ను లీక్ చేయడంలో కానీ,

మెహర్ రమేష్ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రాకముందే ‘బిగ్ బాస్ 4’ ఫినాలేకి వెళ్ళినప్పుడు అక్కడ బయటపెట్టేయడం వంటివి మనం చూశాం. ఇలా లీక్ లు చేయడం గురించి మెగాస్టారే తనపై తాను పలుమార్లు సెటైర్లు వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.

ఈ సందర్భంగా అనంతపురంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ పక్క చిత్ర బృందంని పొగుడుతూనే ఈ చిత్రంలో కట్టప్ప లాంటి పాత్ర గురించి బయటపెట్టేశారు. అలాంటి పాత్రని ఈ చిత్రంలో పోషించింది సునీల్.

అతని పాత్ర చాలా మిస్టీరియస్ అని చెప్పడంతో ఒరిజినల్ చూసిన వారికి ఆ పాత్ర పై క్లారిటీ వచ్చేసింది. ‘ ‘గాడ్ ఫాదర్’ లో చిరు పోషిస్తున్న బ్రహ్మ అనే పాత్రని అరెస్ట్ చేయించి వెన్నుపోటు పొడిచేది సునీల్ అని అందరికీ క్లారిటీ ఇచ్చేసినట్టు అయ్యింది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus