‘ఇంద్ర’ మూమెంట్‌ను మళ్లీ తీసుకొస్తున్న ‘వాల్తేరు వీరయ్య’

  • January 8, 2023 / 08:28 PM IST

చిరంజీవి అంటే డ్యాన్స్‌.. డ్యాన్స్‌ అంటే చిరంజీవి. అభిమానులే కదా, న్యూట్రల్‌ ప్రేక్షకులు కూడా అదే మాట అంటుంటారు. అంతలా చిరంజీవి, డ్యాన్స్‌ మిక్స్‌ అయిపోయాయి. ఈ క్రమంలో చిరంజీవి నుండి సిగ్నేచర్‌ స్టెప్పులు రావడం మొదలైంది. సినిమా సినిమాకు చిరంజీవి కొత్త కొత్త గ్రేస్‌ మూమెంట్స్‌, స్టెప్స్‌ వేస్తూ వచ్చారు. చిరంజీవి సిగ్నేచర్‌ స్టెప్పుల్లో వీణ స్టెప్‌ చాలా స్పెషల్‌ అని చెప్పాలి. చాలా కూల్‌గా, గ్రేస్‌గా ఉండే ఈ స్టెప్‌ను మరోసారి మీరు వెండితెరపై చూడబోతున్నారు.

అవును, మీరు చదివింది నిజమే.. ‘ఇంద్ర’ సినిమాలోని వీణ స్టెప్‌ను చిరంజీవి మరోసారి వేశారు అని సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ఓ పాటలో చిరంజీవి ఈ స్టెప్‌ వేశారు అని చెబుతున్నారు. ‘పూనకాలు లోడింగ్‌..’ పాటలోనే ఈ స్టెప్‌ ఉందని కొందరు చెబుతుంటే.. ‘శ్రీదేవి చిరంజీవి..’ పాటలో ఈ స్టెప్‌ ఉండొచ్చు అని మరికొందరు అంటున్నారు. ‘వింటేజ్‌ చిరంజీవిని చూపిస్తా’ అంటూ దర్శకుడు బాబీ చాలా రోజుల క్రితమే మాటిచ్చి ‘వాల్తేరు వీరయ్య’ మొదలెట్టారు. అందులో భాగంగానే ఈ స్టెప్‌ వేయించారు అని టాక్‌.

ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ ప్రచార చిత్రాల్లో వింటేజ్‌ చిరంజీవి కనిపిస్తున్నారు. ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫైర్‌ లుక్‌తో ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఇప్పటివరకు విడుదలైన పాటల్లో చిరు కొన్ని గ్రేస్‌ స్టెప్పులు కూడా వేశాడు. అవన్నీ నాటి చిరంజీవిని గుర్తు చేస్తున్నాయనే చెప్పాలి. ఇప్పుడు వీణ స్టెప్‌ కూడా పెట్టారు అంటూ.. ఇక ఫ్యాన్స్‌కు ఫుల్‌ పండగే అని చెప్పాలి. ఇక దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. ఈనెల‌ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

అయితే ఇక్కడే విషయం గుర్తుంచుకోవాలి. ఆ మధ్య ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ఇదే వీణ స్టెప్‌ను వేసి నవ్వులపాలయ్యాడు. ఇప్పుడు తన స్టెప్పే తను వేసి చిరంజీవి అలరించబోతున్నాడు. కాబట్టి ఫ్యాన్స్‌ వీణ స్టెప్‌కి రెడీ అవ్వండి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus