గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై “చావు కబురు చల్లగా” అనే కొత్త సినిమాను ప్రకటించిన ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ మరో వైపు నెగెటివ్ పాత్రలలోను సందడి చేస్తున్నాడు. ఆ మధ్య నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్గా కనిపించి అలరించిన కార్తికేయ ఇప్పుడు అజిత్ సినిమాలో విలన్గా నటించేందుకు సిద్ధమయ్యాడట. అజిత్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. తెలుగులో అజిత్ మార్కెట్ దృష్ట్యా కార్తికేయను విలన్గా తీసుకున్నారట. త్వరలోనే కార్తికేయ ఈ సినిమా షూటింగ్కు హాజరవుతాడని సమాచారం.
కథానాయకుడిగా నటించిన “90 ML” డిజాస్టర్ గా నిలవడం. సినిమాకి ఓపెనింగ్స్ గట్రా కూడా లేకపోవడంతో తన మార్కెట్ ను అర్ధం చేసుకున్నా కార్తికేయ.. హీరోగా నిలదొక్కుకోవడానికంటే ముందు మార్కెట్ ను పెంచుకోవడం ముఖ్యమని అర్ధం చేసుకున్నాడు. మరి అజిత్ సినిమాలో విలన్ అవకాశం కార్తికేయకు ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.