Jr NTR, Rajamouli: జక్కన్న తారక్ కాంబినేషన్ రిపీట్ కానుందా.?

  • June 5, 2021 / 04:07 PM IST

జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో రాజమౌళి టాలీవుడ్ కు దర్శకునిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే రాజమౌళి దర్శకునిగా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. రాజమౌళి రెండో సినిమా సింహాద్రిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. సింహాద్రి సినిమాతో స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకున్న రాజమౌళి ఆ సినిమా తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ప్రస్తుతం రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 13వ తేదీనే ఈ సినిమా రిలీజయ్యే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ సడలింపులు అమలులోకి వచ్చిన తరువాత షూటింగ్ ను ప్రారంభించాలని జక్కన్న భావిస్తున్నారని సమాచారం. అయితే ఆర్ఆర్ఆర్ కాకుండా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

మహేష్ తో రాజమౌళి సినిమా పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ఆర్ఆర్ఆర్ కాకుండా రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే సమయానికి మహేష్ రాజమౌళి సినిమా పూర్తై రాజమౌళి ఫ్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024లో ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మహేష్ సినిమా తరువాత రాజమౌళి తరువాత సినిమాకు హీరో కన్ఫామ్ కాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus