నా గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తావా : కంగనా

  • July 9, 2019 / 02:57 PM IST

బాలీవుడ్ క్వీన్ కంగనా నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు కూడా మరో వివాదానికి తెరలేపి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది కంగనా. ఈ చిత్రం ప్రమోషన్ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఓ జర్నలిస్ట్ పై మండిపడింది. విషయం ఏమిటంటే… ‘మణికర్ణిక’ చిత్రం విడుదల సమయంలో ఓ జర్నలిస్ట్… ‘పాకిస్తాన్ లో షో లు ఇచ్చే ఇండియన్ సినీ స్టార్స్ ను వ్యతిరేకించే కంగనా రనౌత్… తన సినిమాని మాత్రం పాకిస్తాన్ లో ఎలా విడుదల చేస్తుంది అంటూ ప్రశ్నించాడు. దేశ భక్తురాలిని అని చెప్పుకునే కంగనా ఇలా చేయడం ఏంటి’ అంటూ పెద్ద కథనం రాసేశాడు కూడా.

ఆ జర్నలిస్ట్ రాసిన ఆ కథనానికి ఇప్పుడు ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రం సాంగ్ విడుదల సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో… ఆ జర్నలిస్ట్ ను టార్గెట్ చేసి రివేంజ్ తీర్చుకుంది.”నా ‘మణికర్ణిక’ చిత్రం గురించి ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేసావ్. ఆ సినిమాను చేసి నేను తప్పు చేశానా? జాతీయవాది అంటూ నాపై ముద్ర వేశావు. గతంలో నీకు నేను మూడు గంటల పాటు సమయం కేటాయించి పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పుడు నన్ను బాగా మెచ్చుకుని తర్వాత ఇలా చేస్తావా?’ అంటూ అతని పై మండిపడింది. దీంతో ఆ సమావేశం మొత్తం రభస.. రభస అయ్యింది. అయితే కంగనా ఇలా చేయడం కొత్తేమీ కాదు. అయినా ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus