Kangana Ranaut: స్టార్ హీరోయిన్ పై ట్రోల్స్.. కారణమేంటంటే?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏ విషయాన్నైనా.. సూటిగా, భయం లేకుండా మాట్లేడుస్తుంటుంది. సమాజంలోని పరిస్థితులపై తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లుగా చెబుతుంటుంది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్గా పాపులర్ అయింది. సినిమాలు, రాజకీయాలు ఇలా ఏ విషయం గురించి అయినా ఓపెన్ మాట్లాడడానికి ఎంతమాత్రం ఆలోచించదు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలతో పలుసార్లు వివాదాలపాలైంది కంగనా రనౌత్. తాజాగా మరోసారి ఈ బ్యూటీ ట్రోలింగ్ బారిన పడింది.

మార్చి 1న మంగళవారం ఉదయం కంగనా ఎయిర్పోర్ట్లో మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ షేర్ తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశాడు. ఇందులో కంగనా చుట్టూ వై ప్లస్ సెక్యూరిటీ కనిపించింది. సైనికుల రక్షణ మధ్య కంగనా రనౌత్ కనిపించడం కొందరు నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది. ‘కంగనాకు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటా? ఈమెకు ఆ భ‌ద్ర‌త ఎందుకు, ఎవ‌రు ఇచ్చారు’, ‘నేను కట్టే టాక్స్ తన సెక్యూరిటీ కోసమా?’

అంటూ నెటిజ‌న్స్ ట్రోలింగ్ కు దిగారు. మరికొందరు ‘అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావులా కంగనా కనిపిస్తోందంటూ’ ఆమె లుక్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరైతే మోడీ ప్రభుత్వాన్ని మధ్యలోకి లాగుతూ.. బీజేపీకి మద్దతు ఇస్తే చాలు.. వై ప్లస్ కేటగిరీ ఖాయమంటూ సెటైర్లు వేస్తున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus