Keerthy Suresh: చెల్లిగా చేసిన రెండు సినిమాలు ఫ్లాఫ్.. ఈసారి బలి అయ్యేది ఆ హీరోనేనా.?

ఇండస్ట్రీలో మహానటి గా పాపులారిటి సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మరోసారి సిస్టర్ గా నటించబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే రెండు సినిమాల్లో సిస్టర్ గా నటించి ఇద్దరు హీరోలకి బిగ్ డిజాస్టర్ లు ఇచ్చిన కీర్తి సురేష్ ఈసారి సూపర్ సక్సెస్ ఫుల్ నటుడిగా పేరు సంపాదించుకున్న అజిత్ కి నెక్స్ట్ సినిమాలో కీర్తి సురేష్ సిస్టర్ గా కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించబోతుంది అంటూ తెలుస్తుంది . ఇప్పటికే (Keerthy Suresh) కీర్తి సురేష్ సిస్టర్ గా నటించిన రెండు సినిమా పరమ చెత్త టాక్ నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు కీర్తి సురేష్ సిస్టర్ గా నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు . అలా అయితే ఈసారి డిజాస్టర్ అందుకోబోయేది కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు. గతంలో రజనీ కాంత్ పెద్దన్న సినిమాలో కీర్తి సిస్టర్ గా నటించింది.

ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో సిస్టర్ గా నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఏమో అజిత్ సినిమాలో సిస్టర్ గా కనిపించబోతుంది..? దీంతో మరోసారి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు వైరల్ గా మారింది. హీరో నాగ చైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో మత్స్యకారుల కథతో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాతగా వ్యహారిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఈ సినిమాలో సాయిపల్లవి, కీర్తి సురేష్ ను నటింపజేయాలని భావిస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరిని చందూ సెలెక్ట్ చేస్తారనేది తెలియాలంటే వేచి వుండాల్సిందే.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus