ఆ ఫిజిక్ చూస్తే బాలయ్య కొడుక్కి హీరో అయ్యే ఇంట్రెస్ట్ లేనట్టే ఉందిగా..!

నందమూరి బాలకృష్ణ నిన్న తన 60 వ పుట్టిన రోజుని కుటుంబసభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా జరుపుకున్నాడు.లాక్ డౌన్ నియమాలను ఉల్లంగించకూడదు అనే ఉద్దేశంతోనే ఇలా సింపుల్ గా జరుపుకున్నట్టు తెలుస్తుంది. లేకుంటే ఇండస్ట్రీ పెద్దలను అందరినీ ఆహ్వానించి ఘనంగా ఈ వేడుకని నిర్వహించాలని బాలయ్య ప్లాన్ చేసుకున్నాడట. కానీ చివరి నిమిషంలో ఆ ఆలోచన మానుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వేడుకకి బాలయ్య ఫ్యామిలీతో పాటు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, బ్రహ్మణి లు హాజరయ్యారు.

బాలయ్య బర్త్ డే పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే వీటిని చూసిన బాలయ్య అభిమానులు మాత్రం షాక్ కు గురవ్వుతున్నారు. అంతలా ఈ ఫొటోల్లో ఏముందా అనుకుంటున్నారా? ఏమీలేదండి.. ఈ ఫొటోల్లో మన బాలయ్య కొడుకు మోక్షజ్ఞ చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాడు.ఓ పక్క అతను హీరో అవుతాడు అని బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఫోటోల్లో ఇతని ఫేస్ చూస్తుంటే.. అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఏమీ చేస్తున్నట్టే లేదు. కనీసం గ్లో లేకపోగా… చాలా లావుగా ఉన్నాడు. అతను ఏమాత్రం వర్కౌట్లు చేస్తున్నట్టు కూడా కనిపించడం లేదు.

దీంతో అతనికి ‘హీరో అయ్యే ఇంట్రెస్ట్ లేనట్టే ఉంది’ అని బాలయ్య ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అతనితో సమానమైన వయసు ఉన్న నాగార్జున కొడుకు అఖిల్ అప్పుడే 3 సినిమాల్లో నటించేసి తన ట్యాలెంట్ చూపించాడు. ఇక ఎన్టీఆర్, రామ్ లు అయితే 18 ఏళ్ళ వయసుకే మంచి క్రేజ్ ను సంపాదించేసుకున్నారు. కానీ అంత స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా మోక్షజ్ఞ ఏమాత్రం ముందడుగు వెయ్యడం లేదు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus