బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ కలిసి ఉంటారు… కలసి తింటారు.. కలసి సందడి చేస్తారు. అదే టాస్క్‌లు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరి ఆట వాడు ఆడాల్సిందే. ఇదే విషయాన్ని బిగ్‌బాస్ ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు. ఆ మధ్య నాగార్జున కూడా ‘సీరియస్ నెస్’ లేదని కోపమయ్యాడు. దాంతో ఇంటి సభ్యుల్లో కాస్త మార్పు వచ్చినట్లు కనిపించింది. అయితే మళ్లీ నాగార్జునకు కోపం వచ్చిందా… లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే అదే అనిపిస్తోంది.
‘కిల్లర్ కాయిన్స్’ గేమ్‌లో తొలి రోజు సంపాదించిన కాయిన్స్, గేమ్ ఆఖరికి ఉన్న కాయిన్స్ పట్టికను పెట్టి అందరినీ ఇన్వెస్టిగేట్ చేయించాడు నాగార్జున. ఇందులో పోలీసుగా అమ్మ రాజశేఖర్ కనిపిస్తున్నాడు. ఇంటి సభ్యుల్లో అందరూ దొంగలే… ఎవరు మంచి దొంగో, ఎవరు భలే దొంగో తేల్చేశాడు కూడా. ఎవరు ఏ దొంగ అయ్యారో రాత్రికి తెలుస్తుంది. ఇక్కడివరకు బాగానే ఉంది. ‘ఇంట్లో ఎవడి ఆట వాడు ఆడండి… లేకపోతే కథ వేరే ఉంటది’ అంటూ సోహైల్ స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు నాగ్. చూద్దాం ఎవరు ఆట సరిగ్గా ఆడలేదో… ఎవరికి ఆ వార్నింగ్ ఇచ్చాడో.