మళ్ళీ శైలజ కావాలంటున్న రామ్!

  • November 23, 2017 / 07:24 AM IST

కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు రామ్ కి దొరికిన హిట్ “నేను శైలజ”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ద్వారానే మల్లూ బ్యూటీ కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామ్ “హైపర్, ఉన్నది ఒకటే జిందగీ” చిత్రాల్లో నటించినప్పటికీ అవేమీ సరైన విజయం సాధించలేకపోయాయి. దాంతో “హైపర్” లాంటి మాస్ ఎంటర్ టైనర్స్, “ఉన్నది ఒకటే జిందగీ” లాంటి క్లాస్ ఎంటర్ టైనర్స్ కంటే “రెడీ, కందిరీగ”లతో తనకు బాగా అచ్చొచ్చిన కామెడీ ఎంటర్ టైనరే బెటర్ అని భావించి మరో మాంచి కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సన్నద్ధమవుతున్నాడు రామ్.

“సినిమా చూపిస్ట మావ, నేను లోకల్” లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకోవడమే కాక సదరు సినిమాతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ఘనత త్రినాధరావు నక్కినది. ఆయన దర్శకత్వంలో రామ్ సినిమా ఒకే చేసిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్ ను ఎంపిక చేశారట. రామ్ తో “నేను శైలజ”, త్రినాధరావుతో “నేను లోకల్” చిత్రాల్లో నటించి ఉన్న కీర్తిసురేష్ కథ విన్న వెంటనే ఈ ప్రొజెక్ట్ సైన్ చేసిందని సమాచారం. కీర్తి సురేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన “అజ్ణాతవాసి” చిత్రంలో నటిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus