ఆర్ ఆర్ ఆర్ మళ్ళీ వాయిదాపడుతుందా..?

  • March 14, 2020 / 05:27 PM IST

ప్రస్తుత పరిస్థితులలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. కరోనా వైరస్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పై కొత్త అనుమానాలు, భయాలు మొదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ భారీ చిత్రం కావడంతో వందల మంది సిబ్బంది పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నటులు మరియు సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది వేరు వేరు ప్రదేశాలకు చెందివారు అయ్యుంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోకుండా షూటింగ్ నిర్వహించడం వలన కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిరవధికంగా సాగించే అవకాశం ఉండదు.

దేశంలోనే కొన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం దేశంలోని అనేక ప్రాంతాలకు తిరగడం నటులకు సైతం భయం కలిగించే ఆస్కారం కలదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం భారీ షూటింగ్స్ చేపట్టడానికి అనుమతులు ఇవ్వకపోవచ్చు. చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి ముందు ముందు చాల సమస్యలే కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాను అలా అలా చుట్టేసి విడుదల చేద్దాం అంటే కుదరదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా తెరకెక్కించినప్పుడే దాని అవుట్ ఫుట్ ఉన్నతంగా ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అనుకున్న టైం కి పూర్తి అవడం కష్టం అనిపిస్తుంది.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus