Samantha, Naga Chaitanya: మరి చైతు ఇచ్చిన గిఫ్ట్‌ల సంగతేంటి సామ్‌? ఎందుకు పదే పదే అదే ట్రిక్‌!

నాగచైతన్య (Naga Chaitanya) – సమంత Samantha)  విడిపోతున్నారు అని తొలుత ప్రజలకు తెలిసేలా చేసింది ఎవరు? ఈ మాటకు సమాధానం సమంత అతని స్నేహితులు అనే తెలుస్తుంది. విడిపోవడానికి కారణాలు ఏంటి అనేది మనకు తెలియదు కానీ.. ఈ విడాకుల విషయాన్ని పదే పదే మీడియా ముందు చర్చకు తీసుకొచ్చేది మాత్రం సమంతనే. ఆ సమయంలో నాగచైతన్య అండ్‌ ఫ్యామిలీ కామ్‌గానే ఉంటుంది. అందుకేనేమే సమంత పదే పదే ఆ టాపిక్‌ను తన సౌలభ్యం ప్రకారం డిస్కషన్‌కి తీసుకొస్తూ ఉంటుంది.

Samantha

ఇప్పుడు కూడా అదే చేసింది. తన కొత్త వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ బన్నీ’ ప్రచారంలో భాగంగా సమంత ఓ ప్రచార కార్యక్రమంలో తన ‘ఎక్స్‌’కి విలువైన గిఫ్ట్‌లు ఇచ్చాను అని పాత విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే ఏ ఎక్స్‌ అనేది చెప్పలేదు అనుకోండి. ఆ విషయం పక్కన పెట్టి.. చైతన్య గురించే సమంత మాట్లాడితే.. మరి చైతు ఇచ్చిన గిఫ్ట్‌ల సంగతేంటి అనే ప్రశ్న మొదలైంది. “ఒక విషయంలో భారీగా ఖర్చు పెట్టి, ఆ తర్వాత పూర్తిగా వృథా అయినట్లు ఎప్పుడైనా అనుకున్నారా?’ సమంతను హోస్ట్ అడిగితే..

‘నా మాజీకి ఇచ్చిన ఖరీదైన బహుమతులు’ అని సమాధానమిచ్చింది. అయితే ఆమె స్పందన అక్కినేని అభిమానులకు నచ్చలేదు. దీంతో సమంతను వాళ్లు రివర్స్‌లో అడుగుతున్నారు. వివాహ బంధంలో ఉన్నప్పుడు నాగచైతన్య కూడా ఖరీదైన బహుమతులు ఇచ్చి ఉంటాడు కదా అని అంటున్నారు.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు నాగచైతన్య పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఇప్పుడు సమంత ఇలాంటి టాపిక్స్‌ తీసుకొచ్చి ఎందుకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావడం అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. దీనికి సమాధానం ఆమెనే చెప్పాలి. ఇక్కడో విషయం గమనించాలి.. ఇప్పటివరకు అక్కినేని కుటుంబం ఎక్కడా సమంత గురించి ఇలాంటి కామెంట్స్‌ ఎప్పుడూ చేయలేదు. మే బీ ఈ విషయంలో సమంతనే ఎక్కువ హర్ట్‌ అయిందేమో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus