Kissik Song: ‘ఊ అంటావా’ ని మ్యాచ్ చేయలేదు.. ‘దెబ్బలు పడతయ్ రాజా’!

‘పుష్ప 2′ ఐటెం సాంగ్ గురించి చాలా డిస్కషన్లు జరిగాయి. సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే.’పుష్ప’ లో సమంతతో చేయించిన ‘ఊ అంటావా’ సాంగ్ కి దేశవ్యాప్తంగా మంచి రీచ్ వచ్చింది. కాబట్టి ‘పుష్ప 2’ ఐటెం సాంగ్లో ఏ హీరోయిన్ డాన్స్ చేస్తుంది? అనే సస్పెన్స్ చాలా కాలం సాగింది. ఫైనల్ గా శ్రీలీలతో ఐటెం సాంగ్ చేయించారు. ఈరోజు ఆ లిరికల్ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది.

Kissik Song

‘కిస్సిక్’ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ 4 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘అరేయ్ అందరూ వచ్చుండారు గాని పార్టీకి.. ఇప్పుడు దించరా ఫోటో కిస్సిక్ అని’ అంటూ సుకుమార్ వాయిస్ ఓవర్ తో ఈ పాట మొదలైంది. ‘దించర దించర దించు.. బావయ్యొచ్చాడు దించు కిస్ కిస్ కిస్ కిస్సిక్’ అనే లిరిక్స్ మంచి ఊపు తెచ్చే విధంగా ఉన్నాయి. సుబ్లాషిని ఈ సాంగ్ ని ఎంతో హుషారుగా పాడింది. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. మనసి, డి.ఎస్.పి, ఎస్.పి.అభిషేక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ వోకల్స్ కూడా బాగా కుదిరాయి. ‘దెబ్బలు పడతయ్రో రాజా’ అనే లిరిక్స్ మాస్ కి మంచి హై ఇస్తాయి.

‘అమ్మాయిల గ్లామర్ ఫోటోలను చూసి ఆనందించడంలో తప్పు లేదు కానీ వాటిని మార్ఫింగ్ చేయడం వంటివి చాలా తప్పు’ అనే మీనింగ్లో ఈ పాట ఉంది. సుకుమార్ టేస్ట్ కి తగ్గట్టు ఈ ఐటెం సాంగ్ మంచి మీనింగ్ ఫుల్గా ఉంది. కానీ దీనిని ‘పుష్ప’ లోని సమంత ‘ఊ అంటావా’ తో పోల్చి తక్కువ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. సింగర్ ఈ పాటకి సెట్ అవ్వలేదు అనేది వారి వాదన. అయితే సినిమా రిలీజ్ తర్వాత ఈ సాంగ్ కి మరింత రీచ్ అవ్వడం అయితే ఖాయమని చెప్పవచ్చు. అల్లు అర్జున్, శ్రీలీల..ల ఎనర్జిటిక్ డాన్సులు కూడా ఈ పాటకి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి వినేయండి :

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus