Rashmika: నేను ఎవర్ని చేసుకుంటాను అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు: రష్మిక

విజయ్ దేవరకొండ మరియు రష్మిక నడుము బంధం ఏమిటి అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అప్పుడప్పుడు రష్మిక పండగలప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో నుండి పెట్టే ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక నిన్న రష్మిక & విజయ్ దేవరకొండ కలిసి ఓ హోటల్లో భోజనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.

Rashmika

అయితే.. ఇవాళ చెన్నైలో జరిగిన “పుష్ప 2” ప్రీరిలీజ్ ఈవెంట్లో రష్మికను స్టేజ్ మీద నిల్చోబెట్టి తమిళ యాంకర్ అడిగిన ప్రశ్నలకు భలే సమాధానాలు చెప్పింది రష్మిక. ముఖ్యంగా “ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నారా లేక మీరే ప్రపోజ్ చేస్తారా” అని అడిగినప్పుడు “వెయిట్ చేయడాలు లేవు, నేనే వెళ్లి ప్రపోజ్ చేస్తాను” అని చెప్పగా, పెళ్లి చేసుకోబోయేది ఇండస్ట్రీ వ్యక్తినా లేక బయట వ్యక్తినా అని అడిగినప్పుడు “ఎవరు అనేది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు” అని కామెంట్ చేయడం విజయ్ దేవరకొండతో తన రిలేషన్ ను రష్మిక పబ్లిక్ చేసేసింది అని స్పష్టం అయ్యింది. మరి రష్మిక ఓపెన్ అప్ అయిపోయింది కాబట్టి విజయ్ దేవరకొండ కూడా ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

ఇకపోతే.. రష్మిక చేతిలో ప్రస్తుతం ఏడెనిమిది క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో రష్మిక నటిస్తోంది. మరి కెరీర్ ఇంత పీక్స్ లో ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటుందా లేక ఎలాగు రిలేషన్ షిప్ గురించి ఓపెన్ గా ఒప్పేసుకుంది కాబట్టి, కొన్నాళ్లపాటు సినిమాలు చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలవుతుందో చూడాలి. ఎందుకంటే.. పెళ్లి చేసుకున్న హీరోయిన్లు స్టార్ డమ్ ఎంజాయ్ చేసిన దాఖలాలు లేవు.

పేరైనా, పేమెంటైనా నిర్మాతల్ని అడిగి మరీ తీసుకోవాలి: దేవిశ్రీప్రసాద్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus