Devi Sri Prasad: పేరైనా, పేమెంటైనా నిర్మాతల్ని అడిగి మరీ తీసుకోవాలి: దేవిశ్రీప్రసాద్

సాధారణంగా ఆడియో లాంచ్ లేదా ప్రీరిలీజ్ ఈవెంట్లలో భీభత్సమైన ఎనర్జీ నింపే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మొదటిసారి తన కోపాన్ని వెళ్లగక్కాడు. అప్పట్లో “సింహా” సక్సెస్ మీట్ లో బోయపాటి చేసిన కామెంట్స్ కి వెంటనే రిటార్ట్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ ఇవాళ చెన్నైలో జరిగిన “పుష్ప 2” ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. “మనకి ఏం కావాలో అది అడిగి తీసుకోవాలి.. అది నిర్మాత దగ్గర పేమెంట్ అయినా, స్క్రీన్ పై పడాల్సిన పేరైనా” అంటూ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Devi Sri Prasad

“పుష్ప 2” బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో గత కొన్ని రోజులుగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నేపథ్య సంగీతం అందించడం కోసం తమన్, అజనీష్, సామ్ సి.ఎస్ రంగంలోకి దిగారని.. దేవి అనుకున్న టైమ్ కి వర్క్ ఫినిష్ చేయకపోవడం వల్లే ఇదంతా అని రకరకాల వాదనలు వినిపించాయి. వాటన్నిటికీ ఇవాళ స్టేజీ మీద సమాధానం చెప్పాడు డీఎస్పీ. మరీ ముఖ్యంగా ప్రొడ్యూసర్ రవిని ఉదేశించి మాట్లాడుతూ.. “నిర్మాత రవి గారికి నా మీద ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ.

టైమ్ కి పాట ఇవ్వలేదు, టైమ్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు అని అడుగుతుంటారు” అని దేవి చేసిన కామెంట్ తాను పర్సనల్ గా ఎంత హర్ట్ అయ్యాడు అనేది తెలియజేస్తుంది. దీంతో దేవి & మైత్రీ నిర్మాతల నడుమ అంత ఫ్రెండ్లీ బాండ్ ఏమీ లేదని స్పష్టమైంది.

మరి దేవి చేసిన ఈ డ్యామేజ్ కి మైత్రీ మూవీ మేకర్స్ ఎలా కవర్ చేసుకుంటారో అనేది చూడాలి. ఇకపోతే.. దేవి శ్రీ ప్రసాద్ స్ట్రయిట్ ఫార్వర్డ్ నేచర్ ని మాత్రం సోషల్ మీడియాలో జనాలు తెగ మెచ్చుకుంటున్నారు. మరి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో దేవి ఇంకో సినిమా చేస్తాడో లేదో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus