సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీపై క్రేజీ న్యూస్..!

Advertisement

ఒక్క నిర్ణయం చాలు మనిషి జీవితాన్ని మార్చి వేయడానికి , అలాగే ఒక్క సినిమా చాలు హీరో ని స్టార్ ని చేయడానికి. దానికి చక్కని ఉదాహరణ అర్జున్ రెడ్డి మూవీ. విజయ్ దేవరకొండ అనే నటుడిని ఓవర్ నైట్ లో స్టార్ ని చేసిన చిత్రం అది. ఆ మూవీతో విజయ్ దేవరకొండ అంటే యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఆ మూవీతో వచ్చిన మైలేజ్ తో క్రేజీ ఆఫర్స్ అందుకొని ముందుకు వెళుతున్నాడు. చిన్న చిత్రంగా విడుదలై భారీ లాభాలు తెచ్చిన పెట్టిన ఆ చిత్రం టాలీవుడ్ లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒక్క సినిమాతో హాట్ ఫేవరేట్ డైరెక్టర్ అయ్యారు.

ఒక్క సినిమాతో ఆయనకు ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఆయన టేకింగ్ కొత్తగా అనిపించింది. అదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి భారీ హిట్ కొట్టాడు. షాహిద్ కపూర్ కెరీర్ లో వంద కోట్లు సాధించిన సోలో మూవీ లేదు. అలాంటిది కబీర్ సింగ్ 300 కోట్లకు పైగా వసూళ్లతో 2019 బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈ క్రేజీ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ అనేది అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. అప్పట్లో బాలీవుడ్ లోనే ఓ మూవీ కమిటైనట్లు వార్తలు వచ్చాయి. కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదు.

ఆ మధ్య స్క్రిప్ట్ పట్టుకొని టాలీవుడ్ లోని అనేక మంది స్టార్స్ దగ్గరకు ఆయన తిరిగాడట. ఐతే అందరూ బిజీగా ఉండడంతో ఆయనకు అవకాశము దక్కలేదు. తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. విజయ్ దేవరకొండతోనే ఆయన తన నెక్స్ట్ మూవీ చేయనున్నారట. దీనికి సంబంధించిన స్టోరీ లైన్, సందీప్ విజయ్ కి చెప్పడం, విజయ్ ఒకే చేయడం కూడా జరిగిపోయాయట. పూరి మూవీ తరువాత విజయ్ చేసేది సందీప్ రెడ్డితోనే అంటున్నారు. మరి ఇదే కనుక జరిగితే విజయ్ ఫ్యాన్స్ కి పండగే అనాలి. అర్జున్ రెడ్డి లాంటి మరో సెన్సేషనల్ మూవీ మనం చూడవచ్చు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus