Vijay Devarakonda: వీళ్లిద్ద‌రు క‌లిస్తే డెఫినెట్‌గా అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేస్తారు..ర‌విశంక‌ర్!

అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌రకొండ‌, డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్ మ‌రోసారి వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తోన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న ఖుషి మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అర్జున్ రెడ్డి కాంబోపై మైత్రీ మూవీస్ అధినేత ర‌విశంక‌ర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

డియ‌ర్ కామ్రేడ్, ఖుషి త‌ర్వాత (Vijay Devarakonda) విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మూడో మూవీ చేయాలంటే ఎలాంటి సినిమా చేస్తారని ప్రమోషన్స్‌లో అడిగిన ప్ర‌శ్న‌కు ర‌విశంక‌ర్ చెప్పిన స‌మాధానం ఆస‌క్తిక‌రంగా మారింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్ వంగా కాంబోలో ఓ మూవీ ఫిక్స్ చేసేందుకు సిన్సియ‌ర్ గా ట్రై చేస్తున్నామ‌ని ర‌విశంక‌ర్ అన్నాడు. వీళ్లిద్ద‌రు క‌లిస్తే సాఫ్ట్ జోన‌ర్‌లో సినిమా ఉండ‌ద‌ని, డెఫినెట్‌గా షాకింగ్ కాన్సెప్ట్‌తో అంద‌రిని ఈ సినిమా స‌ర్‌ప్రైజ్ చేస్తుందని ర‌విశంక‌ర్ అన్నాడు.

మైత్రీ మూవీ ర‌విశంక‌ర్ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌ని అర్జున్ రెడ్డి టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈసినిమాతోనే విజ‌య్ స్టార్ లీగ్‌లో చేరిపోయారు.రెబెల్ ఆటిట్యూడ్ ఉన్న ల‌వ‌ర్ బాయ్ పాత్ర‌లో విజ‌య్ యాక్టింగ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో సందీప్ వంగా పేరు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మారుమోగింది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus