Pr’ప్రియమైన నీకు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన స్నేహ ఆ తరువాత ‘హనుమాన్ జంక్షన్’ ‘వెంకీ’ ‘సంక్రాంతి’ ‘శ్రీరామదాసు’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమె మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత కొత్త హీరోయిన్ల రాకతో ఈమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక అటుతరువాత కోలీవుడ్ నటుడు ప్రసన్నను 2012లో ప్రేమ వివాహం చేసుకుంది స్నేహ. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. 2015లో వీరికి విహాన్ అనే కుమారుడు కూడా జన్మించాడు. ఇదిలా ఉండగా స్నేహ ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుండడం విశేషం.
ఇటీవల స్నేహకు సీమంతం జరిగింది. ఆ వేడుకకి సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా ఈ వేడుక జరిగింది. ఇక తెలుగుతో పాటు తమిళంలో కూడా స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈఏడాది వచ్చిన రాంచరణ్ ‘వినయ విధేయ రామా’ చిత్రంలో కూడా వదిన పాత్రలో అలరించింది స్నేహ.