చిన్న పిల్లాడిని కూడా వదలట్లేదు.. ఘోరం!

Ad not loaded.

విశ్వక్ సేన్ (Vishwak Sen) ‘లైలా’ (Laila)  సినిమా బాయ్ కాట్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆ వేడుకలో నటుడు 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj) ..’లైలా’ లో తాను పోషించిన మేకల సత్తి పాత్ర గురించి చెబుతూ.. ‘మొదట్లో 150 మేకలు ఉంటాయి.. కానీ చివర్లో ఏంటి అని అడిగితే 11 మేకలే ఉంటాయి’ అంటూ వైసీపీని ఉద్దేశించి ఆయన సెటైర్లు వేయడం జరిగింది. దీంతో వైసీపీ అభిమానులు బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

Prudhvi Raj

వాస్తవానికి ఆ సినిమాపై అంతగా బజ్ లేదు. విశ్వక్ సేన్ సినిమాలను ఆ స్థాయిలో ప్రేక్షకులు పట్టించుకోరు. అతని సినిమాల ట్రైలర్స్ కూడా అంతలా ట్రెండ్ అవ్వవు. అలాంటిది ‘బాయ్ కాట్ లైలా’ హ్యాష్ ట్యాగ్ ను మాత్రం ఓ రేంజ్లో ట్రెండ్ చేశారు. అది చాలదు అన్నట్లు పృథ్వీరాజ్ ఫోన్ నెంబర్ ను కూడా సోషల్ మీడియాలో పెట్టి..వైసీపీ ఫ్యాన్స్ తో ఫోన్లు చేయించి బూతులు తిడుతున్నారు అంటూ పృథ్వీ కూడా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ’11 అనే పదం వస్తేనే వైసీపీ వాళ్ళు వణికిపోతున్నారు. సినిమాని సినిమాగా చూడండి.

నా తల్లిని,భార్యను కూడా అశ్లీల పదాలతో దూషించారు’ అంటూ పృథ్వీ కూడా బూతులతో రెచ్చిపోయాడు. దీంతో వైసీపీ శ్రేణులు మరింతగా పృథ్వీని టార్గెట్ చేశారు. ‘బుల్లిరాజులానే పృథ్వీ కూడా రెచ్చిపోతున్నాడు. ఆ పిల్లాడు కూడా జనసేన తరఫున ప్రచారం చేశాడు.ఇలాంటి వాళ్ళకే సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళ సినిమాలను బ్యాన్ చేయాలి’ అంటూ మరిన్ని ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే బుల్లి రాజు అలియాస్ రేవంత్ అనే చిన్న పిల్లాడిని కూడా వైసీపీ బ్యాచ్ టార్గెట్ చేయడం అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus