ప్రముఖ సినీ నటి భానుప్రియ తన ఇంట్లో మైనర్ బాలిక సంధ్యను పనిలో పెట్టుకుని.. ఒక సంవత్సరం నుండీ తనను వేధిస్తోందని … సామర్లకోటకు చెందిన సంధ్య తల్లి అయిన ప్రభావతి పోలీస్ కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు భానుప్రియ సోదరుడు మైనర్ బాలిక అయిన సంధ్య పై లైంగిక దాడి చేస్తున్నట్లు కూడా తన తల్లి ప్రభావతి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఇటీవల ఈ విషయం చాలా వైరల్ అయ్యింది.
ఇక విషయం పెద్దది కావడంతో మీడియా ముందుకొచ్చిన భానుప్రియ.. సంధ్యను బాగానే చూసుకుంటున్నామని, ఆమె ఇంట్లో దొంగతనాలు చేస్తుండడంతో ప్రభావతిని పిలిచి వివరించామని .. దొంగిలించిన సొమ్ముని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరామని.. చెప్పడంతో ప్రభావతి రివర్స్ అయ్యి వారి పై కేసు పెట్టిందని… భానుప్రియ క్లారిటీ ఇచ్చింది కూడా. అయితే… ఇప్పుడు భానుప్రియపై మరో కేసు నమోదయ్యింది. మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడం, హింసించడం వంటి నేరాల కింద ఏపీ డీజీపీకి బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేయడంతో… వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని వినతి పత్రం అందించడం గమనార్హం. ఈ విషయంతో ఇప్పుడు భానుప్రియ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుందనే చెప్పాలి..! మరి చివరికి ఏమవుతుందో తెలియాలంటే.. వేచి చూడక తప్పదు..!