Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా శుభవార్తే కదా!

  • July 29, 2022 / 05:15 PM IST

స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదనే సంగతి తెలిసిందే. సలార్, ఆదిపురుష్ సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే 2022లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు విడుదలవుతాయని వార్తలు వచ్చినా అలా జరగలేదు. 2022లో సాధ్యం కాకపోయినా 2023 సంవత్సరంలో ఈ విధంగా జరగడం సాధ్యం కానుంది.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే థియేటర్లలో విడుదల కానున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లు కీలకం కాగా ఈ మూడు సీజన్లలో తన సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా సలార్ సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ సమయానికి పూర్తవుతుందని

పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి 2023 సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమా 2023 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వరుసగా సినిమాలలో నటించడంతో పాటు తన సినిమాలు సక్సెస్ సాధించే విధంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ప్రభాస్ ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ మారుతి కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే హీరో లేనంత బిజీగా ప్రభాస్ ఉండటం గమనార్హం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus