Prabhas: సలార్ మూవీ రిలీజ్ పై డిస్ట్రిబ్యూటర్స్ షాకింగ్ ట్వీట్.. ఏమైందంటే?

  • December 15, 2023 / 11:00 AM IST

సలార్ మూవీ రిలీజ్ కోసం, బుకింగ్స్ కోసం, ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది. సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రల మధ్య స్నేహం ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓవర్సీస్ లో సలార్ మూవీ ఐమ్యాక్స్ వెర్షన్ రిలీజ్ కాదని అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

సలార్ మూవీ రిలీజ్ పై డిస్ట్రిబ్యూటర్స్ షాకింగ్ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఎక్స్డీ, పీ.ఎల్.ఎఫ్ స్క్రీన్స్ లో మాత్రమే ఈ సినిమాను చూసే అవకాశం అయితే ఉందని ప్రత్యంగిరా సినిమాస్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చివరి నిమిషంలో అభిమానులు నిరుత్సాహానికి గురి కాకూడదనే ఆలోచనతో ముందుగానే ఈ సమాచారం ఇస్తున్నామని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు.

ఓవర్సీస్ ఆడియన్స్ ఈ పోస్ట్ గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఓవర్సీస్ లో సలార్ మూవీ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ డే ఓవర్సీస్ కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సలార్ మూవీపై రాబోయే రోజుల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

సలార్ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ సినిమాలో ఎన్నో ట్విస్ట్ లు ఉంటాయని సమాచారం అందుతోంది. సలార్ సినిమా ప్రభాస్ (Prabhas) స్థాయిని పెంచే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus