మళ్ళీ మేఘ ఆకాష్ తో అంటే కష్టమే..!
- August 14, 2017 / 09:48 AM ISTByFilmy Focus
కాంబినేషన్ మరీ కేక పుట్టించేలా లేకపోతే ఆడియన్సే ఎంకరేజ్ చేయరు, అలాంటిది బిలో యావరేజ్ టాక్ తెచ్చుకొన్న సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడితో ఇమ్మీడియట్ గా మరో సినిమా చేసే సాహసం చేస్తాడంటారా అంటూ ఫిలిమ్ నగర్ వర్గాల డిస్కషన్. ఈ డిస్కషన్ లో విషయం లేకపోలేదు. ఎందుకంటే.. నితిన్ ఇంతకుమునుపు రిపీట్ చేసిన నితిన్ మీనన్ తో నితిన్ మొదట నటించిన “ఇష్క్” సూపర్ హిట్ అయ్యి ఉండడం వల్ల ఆ పెయిర్ మళ్ళీ “గుండేజారి గల్లంతయ్యిందే”లో ఇమ్మీడియట్ గా రిపీట్ అయినా ప్రేక్షకులు ఆదరించారు.
కానీ.. మేఘా ఆకాష్ విషయం అలా కాదు, అమ్మడు నటించగా విడుదలైన మొదటి సినిమా ఇదే. అమ్మాయిగారి డెబ్యూ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు నితిన్ తో నటించిన “లై” బిలో యావరేజ్ టాక్ తెచ్చుకోవడం, ముఖ్యంగా హీరోయిన్ గా నటించిన మేఘకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు, అటు విశ్లేషకులు కానీ, ఇటు ప్రేక్షకులు కానీ మేఘ ఆకాష్ ను హీరోయిన్ గా పెద్దగా గుర్తించలేదు. పెర్ఫార్మెన్స్ అయితే అసలు లేకపోవడంతో.. నితిన్ ఏరికోరి ఈ అమ్మడిని ఎందుకు ఎన్నుకొన్నాడా అనుకొంటున్నారందరూ. మరి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మేఘ ఆకాష్ విషయాన్ని ఏమైనా పునరాలోచిస్తాడా లేక తన గట్ ఫీలింగ్ తో ప్రొసీడ్ అయిపోతాడో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











