మెగా హీరోల సినిమాల్లో ఏం ఉన్నా లేకపోయినా.. డాన్సులు, ఫైటింగులూ ఉండాల్సిందే. ఆవకాయ్ లేకపోతే తెలుగోళ్లకు ముద్ద దిగనట్టు.. అవి లేకపోతే మెగా ఫ్యాన్స్‌కి సినిమా చూసినట్టుండదు. అయితే రామ్‌చరణ్ తొలిసారి అందుకు భిన్నమైన ప్రయత్నం చేస్తున్నాడు. ధృవ సినిమాతో. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మూడంటే మూడు పాటలే ఉన్నాయట. సాధారణంగా మెగా హీరో సినిమా అంటే కనీసం 5 పాటలుండాలి. కానీ.. ఈ సినిమాలో ఆ లెక్క తప్పింది.
దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే చరణ్ మాత్రం ఆ మూడు పాటల్లో రెండు డాన్సింగ్ నెంబర్లు ఉండేలా చూసుకొన్నాడట. పాటలు తక్కువైనా…ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఏమాత్రం తగ్గకుండా చరణ్ జాగ్రత్తలు తీసుకొన్నాడని సమాచారం. సినిమా అంతా సీరియస్ మూడ్‌లో సాగుతున్నప్పుడు పాటలొచ్చి కథని డిస్ట్రబ్ చేయకూడదని చరణ్ భావించాడట. అందుకే ఆ నిర్ణయం తీసుకొన్నాడని తెలుస్తోంది.