ముస్లిం పాత్రల్లో మన స్టార్స్

సినీ నటులు అందరి వారు. కుల, మతం అని భేదం లేకుండా ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందుతుంటారు. అందుకే కథ డిమాండ్ ని బట్టి ఏ మతం వ్యక్తిగా నైనా నటించడానికి వెనుకాడరు. ఆ సన్నివేశాలను రక్తి కట్టిస్తారు. రేపు ముస్లిముల పవిత్ర పండుగ బక్రీద్ ను పురస్కరించుకుని వెండితెరపై ముస్లిం పాత్రల్లో మెరిసిన మన స్టార్ హీరోలపై కథనం.

వెంకటేష్విక్టరీ వెంకటేష్ మల్లీశ్వరీ మూవీలో పెళ్లికాని ప్రసాదుగా నవ్వులు పూయించారు. ఇందులో పెళ్లికావాలని దేవుళ్లను వేడుకుంటుంటాడు. ఈ క్రమంలో వెంకీ మసీదుకు వెళ్లి నమాజు చేస్తాడు. మొత్తానికి యువరాణిని పెళ్లి చేసుకుంటాడు.

రవితేజమాస్ మహారాజ రవితేజ ఎనర్జిటిక్ గా నటించిన సినిమా దరువు. ఇందులో బుల్లెట్ రాజా గా, హోమ్ మినిస్టర్ గా డబల్ రోల్ చేసి యాక్షన్, కామెడీ పండించాడు. ఈ చిత్రంలో మసీద్ పై ముస్లిం వేష ధారణలో ఉన్న రవితేజ చిత్రాన్ని మనం చూడవచ్చు. ఈ పోస్టర్ సినిమా కథను మలుపు తిప్పుతుంది.

ఎన్టీఆర్యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా హిట్ చిత్రం జనతా గ్యారేజ్. ఇందులో మిత్రులతో కలిసి ముస్లిం వస్త్ర ధారణలో తారక్ కనిపించి కనువిందు చేశారు. దీంతో ఎన్టీఆర్ ముస్లిం అభిమానులు చాలా సంతోషించారు.

మహేష్ బాబుసూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా రికార్డులను సృష్టించింది. ఇందులో జాగో జాగోర జాగో పాట అందరి మనుసులను గెలుచుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఇందులో ముస్లింలతో కలిసి నడిచే కొన్ని క్షణాలు గుర్తుండి పోతాయి.

బాలకృష్ణనటసింహ నందమూరి బాలకృష్ణ అయితే సినిమా మొత్తం ముస్లిం పాత్ర పోషించి అన్ని మతాల వారిని తన నటనతో మెప్పించి విజయం సొంతం చేసుకున్నారు. అక్బర్ సలీం అనార్కలి మూవీలో అక్బర్ గా మహానటుడు నందమూరి తారక రామ రావు, సలీం గా బాలయ్య పాత్రలకు ప్రాణం పోశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus