పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ పనులు స్పీడ్ అందుకున్నాయి. పవన్ డాలీ దర్శకత్వంలో “కాటమరాయుడు” చిత్రీకరణలో బిజీగా ఉంటూనే తర్వాతి సినిమాను నవంబర్లో సెట్స్ పైకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ కూడా తమ సినిమా కోసం తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ తో కలిసి పాటలను స్వరపరుచు కుంటున్నారు. “దేవుడే దిగి వచ్చినా..” అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ముహూర్తపు తేదీని నవంబర్ 5 న ఫిక్స్ చేసిన పవర్ స్టార్ ఈ సినిమాకు కెమెరా మెన్ ని ఖరారు చేశారు.
తన ఖుషి సినిమాకు కెమెరామెన్ గా పనిచేసిన ప్రముఖ ఫోటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి తీసుకున్నట్లు తాజా సమాచారం. అత్తారింటికి దారేది లో ఖుషి భామ ముంతాజ్ తో స్పెషల్ సాంగ్ చేయించి హిట్ అందుకోగా, అదే సెంటిమెంట్ ని దేవుడే దిగివచ్చినా చిత్రానికి ఫాలో అవుతున్నారు. అప్పటి కాంబినేషన్ ని మ్యాచ్ చేస్తున్నారు. త్రివిక్రమ్, పవన్ కలవడం తోనే ఈ ప్రాజెక్ట్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. మళ్లీ దీనికి పీసీ శ్రీరామ్ తోడవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి.