బాలకృష్ణ, పూరీ మూవీ విడుదల తేదీలో మార్పు
- July 18, 2017 / 12:51 PM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా యమ జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ లో బాలకృష్ణ ఫ్రెంచ్ బియర్డ్స్, టర్న్డ్ జీన్స్ లో కొత్తగా కనిపించి సినిమాపై అంచనాలను పెంచారు. ఈ సినిమా గతనెల పోర్చుగల్ ల్లో కొన్ని కీలక సీన్స్ తో పాటు క్లైమాక్స్ ఫైట్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఈనెల మొదటివారంలో హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ మొదలెట్టారు. ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా ఈ షూటింగ్ కొనసాగుతోంది. మరో నాలుగురోజుల్లో (జులై 22 నాటికీ) ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
పూరి, బాలకృష్ణ కలిసి అనుకున్న టైమ్ కంటే ముందుగానే షూటింగ్ కంప్లీట్ చేస్తున్నందుకు నిర్మాత ఆనందంగా ఉన్నారు. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా అంతే వేగంగా కంప్లీట్ చేసి.. ముందుగా ప్రకటించిన తేదీ (సెప్టెంబర్ 29 ) కంటే కొన్ని రోజుల ముందుగానే రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. అయితే నందమూరి అభిమానులకు దసరా పండుగ ముందుగా రానుందన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















