Pakka Commercial: పక్కా కమర్షియల్ రిజల్ట్ తో మారుతికి షాక్ తప్పదా?

Advertisement

ఈరోజుల్లో, బస్ స్టాప్ సినిమాల ద్వారా తక్కువ సమయంలోనే పాపులారిటీని సొంతం చేసుకున్న డైరెక్టర్లలో మారుతి ఒకరు. అయితే ఈ సినిమాల ద్వారా మారుతి సినిమా అంటే యూత్ ను టార్గెట్ చేసే విధంగా ఉంటుందని కామెంట్లు వినిపించాయి. ప్రేమకథా చిత్రమ్ సినిమాకు దర్శకుడు మారుతి అయినప్పటికీ ఆ సినిమా ఫలితంపై కాన్ఫిడెన్స్ లేక మారుతి మరో వ్యక్తి పేరును దర్శకునిగా వేయించారు. మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం సినిమాలు దర్శకునిగా మారుతికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

తాజాగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా ఈ సినిమా ఫలితం ఉండటం గమనార్హం. అయితే ప్రభాస్, చిరంజీవిలతో ఇప్పటికే మారుతి సినిమాలు ఫిక్స్ అయ్యాయి. పక్కా కమర్షియల్ సినిమా ఫలితం నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ లు ఉంటాయా? లేక క్యాన్సిల్ అవుతాయా? అనే చర్చ జరుగుతోంది.

పక్కా కమర్షియల్ ఫలితం ఆశాజనకంగా లేకపోవడంతో ప్రభాస్ సైతం మారుతితో సినిమా చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారని బోగట్టా. అయితే ప్రభాస్ ఎవరైనా దర్శకునికి మాట ఇస్తే ఆ మాట తప్పరని ఇండస్ట్రీలో పేరుందనే సంగతి తెలిసిందే. మారుతి మూవీ విషయంలో ప్రభాస్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో యూవీ క్రియేషన్స్ బ్యానర్ కు నష్టాలు రాగా ఆ నష్టాలను భర్తీ చేయడానికి మారుతి సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

చాలామంది దర్శకులతో పోల్చి చూస్తే మారుతి రెమ్యునరేషన్ కూడా తక్కువే కావడం గమనార్హం. ప్రభాస్ మారుతి కాంబో మూవీకి సంబంధించి అతి త్వరలో క్లారిటీ రానుంది. ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు సైతం ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఇష్టం లేదని బోగట్టా.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read