#PakkaCommercialOnAHA: ఆహా లో పక్కా కమర్షియల్.. ఎప్పటి నుండి అంటే?

  • July 31, 2022 / 12:08 PM IST

ఆహా ఓటీటీకి తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరయ్యారు.విభిన్న పద్ధతిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ అందించడంలో ‘ఆహా’ ముందుంటుంది. మిగిలిన ఓటీటీ ల కంటే ఎక్కువ కంటెంట్ ను అలాగే బెస్ట్ కంటెంట్ ను క్వాలిటీతో ప్రేక్షకులకు అందిస్తుంది ఆహా. ‘సామ్ జామ్’ ‘అన్ స్టాపబుల్’ వంటి టాక్ షోలతో పాటు ఇండియన్ ఐడల్ తెలుగు వంటి సింగింగ్ షోని కూడా ప్రారంభించి మరింతగా ప్రేక్షకులకు దగ్గరైంది. ‘ఆహా’ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరైంది.

పలు కొత్త సినిమాలను హై క్వాలిటీ వెర్షన్ల తో స్ట్రీమింగ్ చేస్తూనే ఒరిజినల్ మూవీస్ ను, వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ప్రతీవారం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక ఈ శుక్రవారం నుండీ పక్కా కమర్షియల్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతుంది ఆహా. గోపీచంద్, రాశీ ఖన్నా, దర్శకుడు మారుతీ కాంబినేషన్లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ చిత్రం జూలై 1 న విడుదలయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీలో హీరో గోపీచంద్ కమర్షియల్ లాయర్ పాత్రను పోషించగా, సీరియల్ యాక్టర్ గా రాశీ ఖన్నా నటించింది.

సత్య రాజ్, రావు రమేష్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, అజయ్ ఘోష్.. వంటివారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.మారుతి మార్క్ కామెడీ, గోపీచంద్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఈ మూవీలో పుష్కలంగా ఉంటుంది. ఆగష్టు 5 నుండీ ఈ మూవీ అహాలో స్ట్రీమింగ్ కానుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus