మాస్ డైరెక్టర్  వి.వి వినాయక్ చేతుల మీదుగా విడుదలైన  వెంప కాశీ  “పంచనామ” ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్

  • December 21, 2021 / 09:50 PM IST

వెంప కాశీ గారు పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ క్రియేషన్ చిత్ర యూనిట్ మాస్ డైరెక్టర్  వి.వి వినాయక్ గారు చేతుల మీదగా పంచనామ సినిమా కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వెంప కాశీ గారి గురుంచి వి.వి వినాయక్ గారు మాట్లాడుతూ.. వెంప కాశీ గారిని ఎన్నోసార్లు సినిమాలో నటించమని అడిగినా చెయ్యని వ్యక్తి పంచనామ అనే సినిమాలో చేశారు అని వినగానే షాక్ కి గురి అయ్యాను. అసలు ఈ సినిమా ఎందుకు చెయ్యవలిసి వచ్చింది క్యారెక్టర్ ఏంటి ఆ డైరెక్టర్ చెప్పిన విధానం ఏంటి ఎలా ఒప్పించారని చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు.

కనుక ఆ క్యారెక్టర్ విన్న తరువాత అప్పుడు అనిపించింది ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటు డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడుకి నా మనస్పూర్తిగా దీవెనలు తెలుపుతున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది కనుక ఆ పోస్టరే చెబుతుంది ఈ సినిమా ఎంత కసిగా చేసారని. పంచనామ చిత్ర యూనిట్ సబ్యులఅందరికి నా అభినందనలు తెలుపుతున్నాను.

పంచనామ చిత్ర డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడు  మాట్లాడుతూ.. వి.వి వినాయక్ గారు చాలా బిజీగా ఉన్నా కూడా ఆయన చేతులు మీదగా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనని నేను బ్రహ్మ అని పిలుచుకుంటాను. నాకు ఇష్టమైన డైరెక్టర్స్ లో వి.వి వినాయక్ గారు ఒకరు ఆయన ఇచ్చిన దీవెనలు నాలో మరింత పాజిటివ్ ఎనర్జీ నింపాయి. వి.వి వినాయక్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus