ప్రేక్షకాదరణతో దూసుకెళ్తున్న ‘పరిగెత్తు పరిగెత్తు’!

థియేటర్లలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘పరిగెత్తు పరిగెత్తు’. సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన ఈ సినిమాను ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు. రామకృష్ణ తోట దర్శకత్వం వహించారు. ఈ వారం విడుదలైన నాలుగు చిత్రాల్లో ‘పరిగెత్తు పరిగెత్తు’ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్ల నుంచి సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా

హీరో సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ…మా సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’ కు మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తప్పకుండా ఆదరణ ఉంటుందని ఆడియెన్స్ మరోసారి నిరూపించారు. నా క్యారెక్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అన్నారు.

దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ…మేము ఎలాంటి రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేశామో ప్రేక్షకులు అంత మంచి హిట్ ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమాకు అందించారు. థియేటర్ దగ్గర సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. జెన్యూన్ టాక్ తో మా సినిమా ప్రదర్శితం అవుతోంది. ప్రతి షో కూ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతూ, మరింత ఆదరణ దక్కుతోంది. ఈ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus