సినిమాల్లో రొమాంటిక్ సీన్లలో నటించడానికి చాలా మంది తారలు ఇబ్బంది పడుతుంటారు. తెరపై కెమిస్ట్రీ సరిగ్గా పండకపోతే సినిమా ఆడదు. అందుకే ఇంటిమేట్ సీన్లలో నటించేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే వీరిపై ఎవరూ పెద్దగా స్పందించరు. ఈ మధ్యకాలంలో కొందరు నటీమణులు రొమాంటిక్ సీన్ చిత్రీకరించినప్పుడు పలానా నటుడు ఓవర్ చేశాడంటూ మీటూ ఉద్యమంలో భాగంగా కామెంట్స్ చేశారు. తాజాగా నటి పరిణీతి చోప్రా రొమాంటిక్ సీన్స్ లో నటించడంపై కొన్ని కామెంట్స్ చేసింది.
ఈ బ్యూటీ బాలీవుడ్లో కొన్ని హాట్ సన్నివేశాల్లో కనిపించింది. లిప్ లాక్ సీన్స్ లో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా నటించింది. ఈ క్రమంలో ఈ అంశం గురించి స్పందిస్తూ.. రొమాంటిక్ సీన్ల చిత్రీకరణ సమయంలో కట్ అంటే కట్ అని పరిణీతి చెప్పింది. ఆ తరువాత దానికి సంబంధించి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని తెలిపింది. రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తిగా యాంత్రికంగా జరుగుతుందని పరిణీతి చెప్పుకొచ్చింది. అలాంటప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవనేది పరిణీతి మాట.
అలానే సినిమాల గురించి మాట్లాడుతూ.. ఒక్కోసారి నటిస్తున్నప్పుడు బ్యాడ్ ఫిలిం అనే విషయం అర్ధమవుతుందని.. కానీ దర్శకులకు మార్పులు చేయమని చెప్పలేని పరిస్థితిలో ఉంటామని.. దీంతో వాళ్లు చెప్పినట్లుగా నటించేసి బాధగా ఇంటికి వెళ్తుంటానని చెప్పుకొచ్చింది.