మన తెలుగు సినిమా హీరోయిన్లకు కోటి లేదా కోటిన్నర రూపాయల పారితోషికం ఇవ్వడానికే.. “అమ్మో” అంటూ గుండెలు బాదుకొంటుంటారు కొందరు నిర్మాతలు. కానీ.. సరైన విజయాలు, స్టార్ డమ్ లేకపోయినా, కేవలం బాలీవుడ్ హీరోయిన్ అనే ఒకే ఒక్క కారణం చేత ఏకంగా మూడున్నర కోట్ల రూపాయల పారితోషికాన్ని ఏమాత్రం వెనకాడకుండా ఇవ్వడానికి సిద్ధమైపోయారు దర్శకనిర్మాతలు. మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం మే నెలాఖరుకు ప్రారంభం కానుండగా.. పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు పరిశీలించిన అనంతరం బబ్లీ బ్యూటీ పరిణీతి చోప్రాను ఎంపిక చేసారు.
ఈ సినిమాలో నటించడం కోసం పరిణీతి చోప్రా ఏకంగా మూడున్నర కోట్ల భారీ పారితోషికం తీసుకోనుందట. మరి పరిణీతి చోప్రా తీసుకొంటున్న భారీ పారితోషికానికి ఏమేరకు న్యాయం చేస్తుందో చూడాలి!