‘అర్జున్ రెడ్డి’ మూవీతో టాలీవుడ్ లో ట్రెండ్ క్రియేట్ చేసాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. యూత్ అంతా ‘అర్జున్ రెడ్డి’ క్యారెక్టర్ కి ఎడిక్ట్ అయిపోయారు.ఈ సినిమా సెట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.. మూడు గంటలపాటు ఇలాంటి కథతో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడమంటే మామూలు విషయం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు సైతం సందీప్ ని ప్రశంసించాయి. ‘అర్జున్ రెడ్డి’ ని హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి…
వందల కోట్ల కలెక్షన్లతో అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. వెంటనే రణ్ బీర్ కపూర్ తో ‘యానిమల్’ మూవీ ఛాన్స్ వచ్చింది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సందీప్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. రష్మిక మందన్న, అనిల్ కపూర్, పరిణితీ చోప్రా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చెయ్యబోతున్నాడని.. మహేష్ కి కథ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి.
కట్ చేస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఫిల్మ్ కన్ఫమ్ అయిపోయింది. ‘స్పిరిట్’ సినిమాని ప్రభాస్ కెరీర్ లో ఎక్కువ లాంగ్వేజెస్ లో రూపొందిస్తున్నారు. ఇక ‘యానిమల్’ విషయానికొస్తే.. పరిణితీ చోప్రాను ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్ నుండి పరిణితీ తప్పుకుందట. అందుకు కారణం.. బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ ‘చంకీలా’ మూవీలో ఆమెకి ఆఫర్ రావడమే.
పైగా ఇప్పటివరకు ‘యానిమల్’ షూటింగ్ స్టార్ట్ కాలేదు.. ఇంతియాజ్ మంచి రోల్ ఆఫర్ చేశారు. ఇంకెన్నాళ్లు వెయిట్ చెయ్యాలి? అంటుందట. దీంతో, ‘‘బాలీవుడ్ కోసం టాలీవుడ్ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చావ్.. ఇక్కడే నీ ప్రాంతీయ బేధం అనేది తెలిసిపోతుంది.. సందీప్ సినిమాలో ఛాన్స్ మిస్ అయినందుకు కచ్చితంగా బాధపడతావ్, చూస్తుండు’’ అంటూ పరిణీతిని ట్యాగ్ చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు టాలీవుడ్ మూవీ లవర్స్..