Parineeti Chopra Wedding Photos: వైరల్ అవుతున్న పరిణీతి చోప్రా పెళ్లి ఫోటో.. మా హృదయాలకు తెలుసంటూ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణితీ చోప్రా వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను పరిణీతి చోప్రా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది. పరిణీతీ చోప్రా రాఘవ్ చద్దా జోడీ చూడచక్కగా ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పరిణీతి చోప్రా ఫోటో షేర్ చేయడంతో పాటు బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర మా పరిచయం మొదలైందని వివాహ బంధంలోకి అడుగుపెట్టే రోజు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తుండగా ఆ కల నెరవేరిందని ఆమె అన్నారు. నేను, రాఘవ్ చద్దా భార్యాభార్తలు కావడం సంతోషాన్ని కలిగిస్తోందని పరిణీతి చోప్రా కామెంట్లు చేశారు. మేమిద్దరం ఒకరికొకరు లేకుండా జీవించలేమని ఆమె వెల్లడించారు.

మా జీవిత ప్రయాణం ఇప్పటినుంచి మొదలవుతుందంటూ పరిణీతి చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా పరిణీతి రాఘవ్ వివాహం జరిగింది. ప్రముఖ రాజకీయ నేతలు, బాలీవుడ్ నటీమణులు ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కొత్త జంటను అందరూ రాగ్ణీతి అని పిలుస్తుండటం గమనార్హం.

పెళ్లికి హాజరైన అతిథులు పెళ్లి ఫోటోలు తీయకుండా పరిణీతి చోప్రా కఠిన నిబంధనలు అమలు చేశారు. అయితే ఆమే స్వయంగా పెళ్లి ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది. పరిణీతి చోప్రా షేర్ చేసిన ఈ ఫోటోకు నిమిషాల్లోనే లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఈ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిణీతి చోప్రా రాఘవ్ చద్దా కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

 

 

 

 

 

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus