నాగ్ భక్తి చిత్రంలో హైదరాబాద్ అమ్మాయి..!
- June 22, 2016 / 12:06 PM ISTByFilmy Focus
బాబా హతీరామ్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఓం నమో వెంకటేశ’ చిత్రం తెరకెక్కనుండగా.. ఈ చిత్రం జూన్ 29 సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించనున్న ఈ భక్తి చిత్రంలో బాబా హతీరామ్ పాత్రలో అక్కినేని నాగార్జున నటించనున్నాడు.
ఈ చిత్రం లో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రను సౌరభ్ రాజ్ పోషిస్తుండగా.. విమలా రామన్ శ్రీదేవి పాత్రలో నటించనుంది. వేంకటేశ్వర స్వామి భార్యల్లో ఒకరైన భూదేవి పాత్రలో హైదరాబాద్ అమ్మాయి పావని గంగి రెడ్డి నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ఆమె ఇటీవలే విడుదలైన రైట్ రైట్, బ్రహ్మోత్సవం చిత్రాల్లో నటించింది.మరోవైపు ఈ చిత్రంలోఅనుష్క కూడా ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుంది. మహేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నాడు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















